కాలం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో మంచి విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో శుభఫలితాలు కనిపిస్తాయి. గతంతో పోలిస్తే గ్రహబలం మెరుగ్గా ఉంటుంది. దశమస్థాన సూర్యబలం బాధ్యతలను సమర్థంగా నిర్వహించేందుకు సహకరిస్తుంది. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో మంచి అవకాశాలు కనిపిస్తాయి. బుధబలం సరైన నిర్ణయాలకు తోడ్పడుతుంది. ఆర్థికాభివృద్ధికి అనుకూలత ఉంటుంది. కొత్త ప్రయత్నాలకు ముందు పూర్తి వివరాలు తెలుసుకోండి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. శ్రీమహాలక్ష్మి అమ్మవారిని స్మరించండి.