వ్యాపార యోగం బలంగా ఉంది. తెలివిగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా శీఘ్ర విజయాలు పొందుతారు. ఉద్యోగంలో బుద్ధిబలం ఉపయోగించండి. ఇతరుల విషయాల్లో కలుగచేసుకోకుండా మీ పనిపై దృష్టి పెట్టండి. మేలు చేసే విషయంలో కూడా జాగ్రత్త అవసరం. పంచమ శుక్రయోగం ధన యోగాన్ని ఇస్తుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. పరోపకార ధోరణి ద్వారా మానసిక సంతృప్తి పొందుతారు. కుటుంబం సంతోషంగా ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు చదవడం శుభప్రదం.