Logo

లక్ష్యసాధనకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఏకాగ్రతతో పనులు ప్రారంభించండి. మనోబలం మీ కృషికి తోడ్పడుతుంది. వ్యాపారంలో అవగాహనతో ముందుకు సాగుతారు. బుధబలం సమయోచిత నిర్ణయాలకు సహకరిస్తుంది. కొత్త ప్రయత్నాలకు ముందు లాభనష్టాలను పరిశీలించాలి. ఉద్యోగంలో మీ పనితీరుతో సామర్థ్యాన్ని నిరూపించుకోండి. బాధ్యతలను సమయానికి పూర్తి చేయండి. ఆర్థిక సంబంధ విషయాల్లో తొందరపాటు వద్దు. చేస్తున్న పని పూర్తయిన తర్వాతే కొత్త పనిలోకి వెళ్లడం మంచిది. శ్రీవేంకటేశ్వర సుప్రభాతం పఠించండి.