సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని విజయమార్గంలో ముందుకు సాగుతారు. తాత్కాలిక నిరుత్సాహం తర్వాత ఆశాజనక ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ఈశ్వరారాధన శాంతిని ప్రసాదిస్తుంది.
గౌరవప్రదమైన స్థితి లభిస్తుంది. కృషిని కొనసాగించండి. నిరుత్సాహం వద్దు. సమయానికి ఫలితం లభిస్తుంది. ధైర్యంగా ఎదుర్కొనే స్వభావం మీ విజయానికి దారి చూపుతుంది. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ చివరికి లాభం గోచరిస్తుంది. మిత్రులు సహకరిస్తారు. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. శివారాధన శ్రేయస్కరం.