కాలం అనుకూలంగా సాగుతుంది. అధికార పరిధితో పాటు బాధ్యతలు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ, వ్యాపార, వృత్తి రంగాల్లో ప్రోత్సాహకరమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. దృఢమైన మనస్సుతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. శ్రీసుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభప్రదం.
గ్రహానుకూలత విశేషంగా ఉండటంతో ఈ వారం ముఖ్యమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవచ్చు. ఉద్యోగంలో మీ పనితీరు మెరుగ్గా ఉండి పెద్దల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో కొత్త ప్రణాళికలు, ఆలోచనలు మంచి ఫలితాలను అందించే అవకాశం ఉంది. ఆదాయాన్ని పెంచే మార్గాలు కనిపిస్తాయి. శ్రమకు తగిన దానికంటే మెరుగైన ఫలితం పొందే సూచనలు ఉన్నాయి. అయితే ఆర్థిక విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. శ్రీలక్ష్మీనారాయణుని ధ్యానం శుభదాయకం.