కుంభము

ఈ రోజు 09 May 2021, Sunday

శుభ కార్యక్రమములలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు మంచినిస్తాయి, మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం చేసేవారున్నారు. విష్ణుసహస్రనామ పారాయణం చేయాలి.

ఈ వారం

బుద్ధిబలంతో ముందుకు సాగితే విజయం తధ్యం. గమ్యాన్ని చేరుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబందించిన శుభవార్తలు వింటారు. ముఖ్య వ్యవహారాల్లో చిరునవ్వుతో ముందుకు సాగితే సమస్యలు తగ్గుతాయి. కీలక విషయాలలో దగ్గరివారి సహకారం అందుతుంది. ఎవ్వరితోను విభేదించకండి, తగాదాలకు దూరంగా ఉండాలి. శత్రువులతో జాగ్రత్త. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వారాంతంలో అనుకూల ఫలితాలున్నాయి. హనుమత్ ఆరాధన శుభప్రదం.