కన్యా

ఈ రోజు 16 October 2024, Wednesday

ఈ వారం

శ్రమ ఫలిస్తుంది. బంధు మిత్రుల సహకారం పరిపూర్ణంగా ఉంది. స్పష్టమైన ఆలోచనలతో గొప్ప ఫలితాలు సాధిస్తారు. ఒక వ్యవహారంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కొన్ని కీలకమైన పనుల్లో పురోగతి ఉంటుంది. అంచెలంచెలుగా పైకెదుగుతారు. స్వస్థానప్రాప్తి ఉంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపచేసే విధంగా ఉంటాయి. ఆరోగ్యం ఫర్వాలేదనిపిస్తుంది. ఆదాయం బాగుంటుంది. సూర్య అష్టోత్తరం పఠిస్తే శుభదాయకం.