శుభయోగాలు ఉన్నాయి. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ధర్మబద్ధంగా ముందుకు సాగి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మనఃస్సౌఖ్యం ఉంటుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో మీ కర్తవ్యాలను మీరు సకాలంలో ప్రారంభించండి. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి. తోటి వారిని కలుపుకొనిపోవాలి. చెడు ఏమాత్రం ఊహించవద్దు. మంచి విషయాలపై దృష్టి నిలపండి. అలాగే ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. వ్యాపారంలో ముందుచూపు అవసరం. ఆర్థిక నష్టాలు రాకుండా సరైన నిర్ణయాలు సకాలంలో తీసుకోవాలి. మనో ధైర్యాన్ని కోల్పోకుండా నిర్ణయాలు తీసుకుంటే ఎక్కువ నష్టం ఉండదు. అనవసర భయాందోళనలకు గురి కావద్దు. లాభంలో శని చక్కటి కార్యసిద్ధిని ఇస్తున్నారు. తోటి వారితో సంతోషంగా గడిపేందుకు కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. శ్రీసూర్యనారాయణ మూర్తి ఆరాధన శుభప్రదం.