ప్రతీ పనిలో విజయం సూచితం. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే పెద్దల నుంచి ప్రశంసలు పొందుతారు. భూ, గృహ సంబంధ విషయాల్లో అనుకూలత ఉంటుంది. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ చివరికి అనుకూల ఫలితాలు వస్తాయి. ధైర్యంగా, శాంతంగా ముందుకు సాగాలి. శ్రీసూక్తం పారాయణ ఐశ్వర్యాన్ని పెంచుతుంది.