ఒక శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు అందుతుంది. బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రీసుబ్రహ్మణ్య స్వామి సందర్శనం మేలు చేస్తుంది.
మీ మీ రంగాల్లో శుభఫలితాలు ఉన్నాయి. మనోబలం అనుకూలిస్తుంది. మీరు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. మీ ఆలోచనల్లో నూతనత ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతస్థాయి వ్యక్తుల సానుకూలత లభిస్తుంది. వ్యాపారంలో లాభదాయకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. సృజనాత్మక ఆలోచనలు మేలు చేస్తాయి. అష్టలక్ష్మీ ప్రార్థన శుభప్రదం.