శివాలయం మరియు వైష్ణవాలయం లేకుండా గతంలో గ్రామాలు లేవు ఎందుకని?? . దీని వెనుక కథ:
Blog Description
"చం.....డీశ్వరుడు
ఒకానొకప్పుడు చిదంబర క్షేత్రంలో ‘యచ్చదత్తనుడు’ అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు.
ఆయనకు ‘విచారశర్మ’ అనబడే కొడుకు ఉన్నాడుఆ కొడుకు వేదం నేర్చు కున్నాడు.ఆయన వేదమును చక్కగా సుస్వరంతో చదివేవాడు.ఎప్పుడూ స్వరంతప్పేవాడు కాదు.గోవులు దేవతలని నమ్మిన పిల్లవాడు.ఒకరోజు ఆవులను కాసే ఒక ఆయన ఆవును కొడుతూ తీసుకువస్తున్నాడు.
అది చూసిన ఆ పిల్లవాడి మనసు బాధపడి ‘నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను.
నీవు ఈ ఆవులను కొట్టవద్దు.తీసుకుని వెళ్ళవద్దు’ అని చెప్పాడు.బ్రాహ్మణుడు బ్రహ్మచారి వేదం చదువుకున్నవాడు ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు.
ఈ పిల్లవాడు వేదమంత్రము లను చదువు కుంటూ వాటిని స్పృశించి వాటిని జాగ్రత్తగా కాపాడు తుండేవాడు.వేదంలో కొన్ని కొన్ని పన్నాలకు కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి.ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు.ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచినీళ్ళు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచి పెట్టేస్తుండేవి.
రోజూ ఇచ్చే పాలకన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి.ఈ పిల్లవాడు ఆవులు ఎలాగూ పాలువిడిచి పెడుతున్నాయి కదా వట్టినే కూర్చోవడం ఎందుకని ఈ ఆవులు విడిచిపెటన పాలతో శివాభిషేకము చేయదలచాడు.
రుద్రం చదవడం కన్నా గొప్పది మరొకటి లేదు.అందుకే లోకమునందు సన్యసించినవారు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం.రుద్రాధ్యాయం అంత గొప్పది.అది చదివితే పాపములు పటాపంచలు అయిపోతాయి.అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలను తీసి రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు.ఒకరోజున అటునుంచి ఒక వెర్రివాడు వెళ్ళిపోతున్నాడు.‘అయ్యో, ఈ పిల్లవాడు ఈ పాలనన్నిటిని ఇసుకలో పోసేస్తున్నాడు.
ఇంకా ఆవులు ఎన్ని పాలిచ్చునో అని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు.చెప్తే యచ్చదత్తనుడికి కోపం వచ్చింది. ‘రేపు నేను చూస్తాను’ అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసేచోట చేట్టిక్కి కూర్చున్నాడు.
పూర్వకాలం క్రూర మృగములు ఎక్కువ.అందుకని కర్ర గొడ్డలికూడా తనతో తెచ్చుకుని చెట్టెక్కి కూర్చున్నాడు.కాసేపయింది.కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడ ఆవులను విడిచిపెట్టాడు.