దృష్టి సోకడం నిజంగా ఉందా ?
Blog Description
తలనొప్పి, కడుపునొప్పి, తిన్నది జీర్ణం కాకపోవడం, తలతిరగడం, కడుపులో తెమలడం, వాంతులు, ఉన్నట్టుండి నీరసించిపోవడం, విపరీతంగా ఆవిలింతలు లాంటి లక్షణాలు కనిపించినప్పుడు దృష్టి సోకింది అనుకోవడం తెలిసిందే. అందునా పసి పిల్లలకు తరచూ దృష్టి సోకినట్లు భావిస్తుంటాం. ఉన్నట్టుండి ఈ రకమైన అనారోగ్య లక్షణాలు కనిపించడం కాకతాళీయమా లేక దిష్టి తగలడమేనా దృష్టి సోకినప్పుడు ఉప్పు లేదా మిరపకాయలు ఆ వ్యక్తి చుట్టూ మూడుసార్లు తిప్పి దిగదీసి నిప్పులో వేస్తారు. లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో వేస్తారు. కొందరు పసుపు, సున్నం కలిపిన ఎర్ర నీళ్ళని దిష్టి తగిలిన వ్యక్తికి నివాళించి మూడు దారులు కలిసే ప్రదేశంలో పారబోస్తారు. ఇంకొందరు చెప్పు, లేదా చీపురుతో దిష్టి తీస్తారు. భౌతికశాస్త్రంలోని తరంగథైర్యం ద్వారా ఈ ప్రక్రియల్లో నివారణ జరుగుతుంది. కొన్ని ఫ్రీక్వెన్సీలను మనం గుర్తించలేం. Ex : కుక్క గుండుసూది కింద పడిన శాబ్ధాన్ని కూడా పసిగడుతుంది. ఆ సామర్ధ్యం మన చెవులకు లేదు. దిష్టి తొలగింపుకు ప్రత్యేక మంత్రాలు వాడుతుండటం కూడా ఇప్పటికి మనం గమనించవచ్చు. విశేషం ఏమిటంటే ఇందుకు ఎలాంటి ఫీజు వసూలు చేయరు. ఇది భారతీయ సంస్కృతిలోని ఒక సైకాలజీ సబ్జెక్ట్. నెగిటివ్ వైబ్రేషన్స్ ను పాజిటివ్ గా మార్పు చేయటమే ఇందులోని కిటుకు.విరగ్గాసిన చెట్లు, నిండా పండిన చేలు, సమృద్ధిగా పాలు ఇచ్చే పాడి పశువులు, నిర్మాణంలో ఉన్న ఇళ్ళు లేదా భవంతి, కొత్తగా కొన్న వాహనం మొదలైన వాటికి కూడా దిష్టి తగులుతుందనే నమ్మకం ఉంది. వీటిక్కూడా దృష్టి సోకకుండా నివారణోపాయాలు ఉన్నాయి.