Nagula Panchami

Festival Description

సాక్షాత్తు పరమేశ్వరుడే నాగపంచమినాడు భక్తులు ఆచరించాల్సిన విధులను పార్వతీ దేవికి వివరించినట్లుగా స్కాందపురాణం చెబుతోంది. శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించడం హిందువుల ఆచారం . నాగ పంచమి రోజున నాగప్రతిమకు పంచామృతము, జాజి, సంపెంగ, గన్నేరు వంటి పుష్పాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి, పాయసము నివేదించాలని ముక్కంటి.. శక్తిమాతకు వివరించినట్లు ఆ పురాణం పేర్కొంటుంది.
ముఖ్యంగా నాగపంచమి రోజున నాగేంద్రేనికి పాలు, మిర్యాలు, పూలు పెట్టి పూజిస్తారు. ఇంట్లో వెండి, రాగి, రాతి చెక్కలతో చేసిన నాగ పడిగెలకు భక్తులు అభిషేకం చేస్తారు. సంతానం కలిగించే పుత్రదైకాదని సంతానం లేని భార్యభర్తలు భక్తి శ్రద్దలతో శ్రావణ శుక్ల 11వరోజైన ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు చేసి ఉపవాసం చేసినట్లైతే సంతానభాగ్యం కలుగుతుందని పురోహితులు అంటున్నారు. దేవతారాధన, జపం, స్తోత్ర పారాయణం వంటివి చేయడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. 
పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక ధనవంతురాలు ఉండేది. ఆమెకు ధనగర్వం గాని అహంకారం గాని లేని సుగుణవతి, విద్యా వినయంగల సౌజన్యురాలు. పెద్దలపట్ల వినయవిదేయతలతోను పనివారి పట్ల కరుణ, దయ సానుబూతిగల సద్గుణ సంపన్నురాలు . ఈ సుగుణ వతికి ఒక తీరని బాధ వుండేది. చెవిలో చీము కారుతుండేది. రాత్రులందు సర్పం కలలో కనబడి కాటు వేయబోతుండేది. అందువల్ల ఆమె మనస్సులో ఎంతో కలవరపడుతుండేది.