ఆధ్యాత్మిక వాస్తవాలు...

Blog Description

1. సూర్యుడ్ని ఏఏ సమయాల్లో చూడరాదు?

ప్రభాతవేళ, సూర్యాస్తమయవేళ, మిట్టమధ్యాహ్న సమయమున రవిని సూటిగా చూడరాదు. అలాగే సూర్య మరియు చంద్రగ్రహణ సమయాల్లోనూ చూడరాదు. అట్టి సమయాల్లో సూర్యుని నుంచి వెలువడే కిరణాలు మానవశరీర నిర్మాణానికి కీడును కలిగిస్తాయి.

2. శ్రీకృష్ణపరమాత్ముడు నెమలి ఫించాన్ని తలపై ఎందుకు ధరిస్తాడు?

సకల చరాచర సృష్టిలో సంభోగం చెయ్యని ఏకైక ప్రాణి నెమలి మాత్రమే. శ్రీకృష్ణునికి 16,000 వేలమంది గోపికలు. అన్ని వేలమంది గోపికలతో శ్రీకృష్ణుడు సరసల్లాపాలు మాత్రమే ఆడాడు. అల్లరి చేసి గెలిచేవాడు. ఆ విషయాన్ని తెలియచేయటానికే శ్రీకృష్ణుడు నెమలి పింఛం ధరిస్తాడు. శ్రీకృష్ణుడు ఒట్టి అల్లరి కృష్ణుడు మాత్రమే.

3. మాతృ, పితృ, ఆచార్య, దైవ ఋషి రుణాలంటే?

పశుపక్షాదుల్లా పుట్టగానే, కాళ్ళు రాగానే బైటికి తరిమెయ్యరు. తల్లీ, తండ్రి ఇద్దరూ జీవితకాలం సంపాదించిన ధనాన్ని పోగు చేసి ఇచ్చి, పెళ్లి కూడా చేసి ధర్మ, అర్థాలతో సుఖించే పరిస్థితులని సృష్టిస్తారు. ప్రేమతో పెంచుతారు. తల్లీ, తండ్రీ రుణం, ఎంత సేవచేసినా తీరదు. చేయాల్సిందల్లా ముసలితనంలో వారని బిడ్డల్లా చూసుకోవటమే.

మల ముత్రాలకు కడిగి పెంచి పెద్ద చేసినందుకు ఆ సమయంలో తల్లి ఋణం తీర్చుకోవాలి. తాను సంపాదనతో నిస్వార్తముతో పెంచి పెద్ద చేసిన తండ్రి ఋణం తీర్చుకోవాలి. లోకజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, నేర్పినందుకు గురు ఋణాన్ని, మనకి బుద్ధినీ, కర్మనీ ఇస్తున్న దైవ ఋణాన్ని భక్తి ద్వారా ధర్మ మార్గం ద్వారా, సకల శాస్త్రాలనూ, ధర్మాలనూ గ్రంథాల ద్వారా మనకు అందచేసినందుకు ఋషి రుణాన్ని తీర్చుకోవాలి.తిరిగి తాను వివాహం ద్వారా అన్ని రుణాలన్నీ తీర్చి, తరిగి తాను ఋణ పడటమే మానవ జన్మ.

4. హారతి వల్ల లాభము ఏమిటి?

గృహములోను, పూజాగదిలోనే కాడు, గుడిలోనూ, శుభకార్యాలప్పుడూ….పిల్లల పుట్టిన రోజుల వేడుకలలోను, క్రొత్త పెళ్లికూతురు గృహములోకి ప్రవేశించేతప్పుడూ హారతి ఇస్తుంటారు. ఎక్కడ హారతి పట్టినా ఓ ఆరోగ్య సూత్రం ఉంది. సుభాకార్యాల్లో ఎన్నో కుటుంబాలకు సంబంధించిన వారు ఒకేచోట చేరుతారు. అలాగే దేవాలయాలలో అనేక మంది భక్తులు దేవుడిని దర్శిస్తుంటారు. దానివలన పరిసర ప్రాంతపు గాలి అపరిశుభ్రం అవుతుంది. అనేక క్రిములు చేరతాయి. కనుక హారతి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా అనేక సూక్ష్మక్రిములు కర్పూర పొగాకు నశిస్తాయి. ముక్కుకు సంబంధించిన వ్యాధులూ, అంటూవ్యాధులూ ప్రబల కుండా ఉంటాయి. కర్పూర హారతి ఎలాగైతే క్షీణించిచేసిన పోతుందో, అలాగే మనం తెలిసీ సమసిపోవాలని కోరుకుంటూ హారతిని కళ్ళకద్దుకోవటమే అసలు సిసలు ఆధ్యాత్మిక అర్థం, పరమార్థం.

5.చిన్న పిల్లలకి దిష్టి ఎందుకు తీస్తారు?

చినారుల పుట్టిన రోజు పండగ వేడుకలలో అలాగే అనేక శుభ కార్యాల్లో పాల్గొన్న పెద్దదిష్టిని లకీ, పిల్లలకీ విభిన్నపద్ధతులలో తీస్తూ ఉంటారు. పిల్లలూ, పెద్దలూ ఘనవిజయాలు సాధించినప్పుడూ, బాగా ప్రశంసలు పొందినప్పుడు అతిగా నీరసించి డీలాపడినప్పుడు దిష్టి తీస్తారు. అలాగే పిల్లలకి పసుపూ, సున్నం కలిపినా నీతితో దిష్టి తీస్తుంటారు. బయటజనుల దృష్టిదోషం తగలకుండా ఉండాలని దిష్టితీస్తే చిన్నపిల్లవాడు కలవరింతలు లేకుండా నిద్రపోవటమూ, నిద్రలో ఉలిక్కిపడుతూ లేవటం వంటి అవలక్షణాలు లేకుండా ఉంటాడు.

చిన్నపిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చూ అనేక వేడుకల్లో పాల్గొనటం వల్ల చుట్టూ అంతా చేరటంవల్ల చిన్నపిల్లలూ లేదా పెద్దలూ కోంత అస్వస్థతకు గురిఅవుతారు. అందుకే వివాహవేడుకలలోను, పుట్టిన రోజువేడుకలలోను విధిగా హారతి ఇచ్చి చివరలో ఎర్ర నీళ్ళలో దిష్టి తీస్తారు. ఎర్రరంగు పదేపదే చూడటం వల్ల అనేక రోగాలు సమసిపోతాయి. మనసుకి ప్రశాంతతతోపాటు ధైర్య గుణంవస్తుంది.

6. ఎలాంటివేళల్లో భోజనాన్ని తినకూడదు?

గ్రహణం సమయమున అనగా సూర్యగ్రహాణానికి 12 గంటల ముందుగా, అలాగే చంద్రగ్రహాణానికి 9 గంటల ముందుగా ఎటువంటి పదార్థాన్ని ఆహారంగా తీసుకోకూడదు.

7. ‘ఏడు’ సంఖ్య మంచిదా కాదా?

తిరుమల తిరుపతిలో కొండలు 7. ప్రత్యక్షదైవం సూర్య భగవానుడి నుంచి వచ్చే కిరణాలు 7, పాతాళం క్రింద లోకాలు 7, భువర్లోకాలు 7. అలాగే ద్వీపాలు 7. పెళ్ళిలో వధూవరులు ఇద్దరూ కలిసి వేసే అడుగులు 7. అగ్ని దేవుని నాలుకలు 7. బ్రహ్మోత్సవాలు జరిగేది 7వ నెలలో. సప్తస్వరాలు కూడా ఏడే. 7 సంఖ్యమంచిది కాదని కొందరి మూఢనమ్మకము. 7 కూడా మంచిదే. భగవంతుడు సృష్టించిన ప్రతిదీ మనకోసమే. డాన్ని ఉపయోగించే పద్ధతుల వల్లే ఫలితం మనకిలభిస్తుంది.

8. దేవునికి దీపారాధన చేసేటప్పుడు దీపాన్ని ఏ నూనెతో వెలిగించాలి?

దీపారాధనకు ఆవునెయ్యి ఉత్తమము. మంచి నూనె మధ్యమము. ఇప్ప నూనె అధమము. ఆవు నెయ్యితో వెలిగించిన దీపము యొక్క ఫలితము అనంతము. అష్టైశ్వరాలూ, అష్టభోగాలు సిద్ధిస్తాయి. వెండి లేదా పంచలోహాలతోనూ, మట్టితో చేసిన దీపాలు అత్యుత్తమము. అలాగే ఆముదంతో వెలిగించి చేసే దీపారాధన వలన దాంతాయి. వేరుశెనగ నూనెతో దీపారాధన చేయరాదు. శ్రీమహాలక్ష్మికి ఆవునెయ్యి దీపమూ, గణపతికి నువ్వుల నూనెతో వెలిగించిన దీపము చాలా ఇష్టము.

9. లక్ష్మీదేవి తామర పువ్వులోనూ, ఇరుప్రక్కలా ఏనుగులతోనూ ఎందుకు ఉంటుంది?

సరస్సులో తామర నిలకడగా ఉండదు. నీటి ప్రవాహానికి కదులుతూ అటూఇటూ ఊగుతూ ఉంటుంది. తానూ నిలకలేని దానిని అని చెప్పటమే లక్ష్మీదేవి తామర పూవులో కొలువై ఉండటములోని పరమార్థం. ఇక ఇరుప్రక్కలా వున్న ఏనుగులకు అర్థం ఏమిటంటే శ్రీమహాలక్ష్మీ ధనబలము గజబలమంతటిదని అర్థం చేసుకోమని పరమార్థం.

10. తిరుమల తిరుపతిలో పూలబావి ప్రత్యేకత ఏమిటి?

అద్దాల మంతపానికి ఉత్తరం దిక్కున ఉండి ఈ పూలబావి. స్వామి వారికి సమర్పించిన తులసీ, పూలదండలు, పువ్వులు ఎవ్వరికి ఇవ్వకుండా ఈ పూలబావిలోనే పడేస్తారు.

ఆపదవచ్చినప్పుడు తొండమానుడు ఈ పూలబావి రహస్య సొరంగ మార్గం ద్వారానే ఆ వెంకటేశ్వరస్వామిని శరణువేడాడు. స్వామి వారు ఆ ఆపద సమయంలో ఏకాంతంగా ఉన్నారు. తొండమానుడ్ని చూసి శ్రీమహాలక్ష్మీ సిగ్గుతో శ్రీమహా విష్ణువు వక్షస్థలంలో చేరింది. అదే సమయంలో భూదేవి తొండమానుడు కట్టించిన పూలబావిలోకి వెళ్ళి రహస్యంగా దాక్కుందని పురాణాల గాధ.

11. ఉత్తరం దిక్కున తలపెట్టి ఎందుకు నిద్రించరాదు?

మన భూమిలో గురుత్వాకర్షణశక్తి ఉత్తర దక్షిణాలుగా ఇమిడి ఉంటుంది. మనమూ అలానే నిద్రపోయామంటే ఉత్తర దక్షిణాల్లో ఇమిడి ఉన్న ఆ శక్తి యొక్క తరంగాలు మన మెదడులో దాగావున్న శక్తివంతమైన విద్యుత్ తరంగాలని తగ్గించి వేస్తాయి. దానివలన అనేక ఆరోగ్య, మానసిక సమస్యలు వస్తాయి. రక్త ప్రసరణ వ్యవస్థలో చాలా మార్పువస్తుంది. మెదడులో లోపాలు తల ఎత్తుతాయి. అలా కాకుండా తూర్పు పడమరల వైపు నిద్రిస్తే మెదడు సుఖవంత స్థానంలో ఉంది మెరుగు పడుతుంది. రక్త ప్రసరణసరిగా జరిగి శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది.

12. స్త్రీ తన కన్నా వయసు ఎక్కువ ఉన్న మగవారిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి?

తన కన్నా ఎక్కువ వయసు గల స్త్రీతో శారీరక సంభోగం వలన పురుషునికి శక్తి తగ్గిపోతుందనేది అసత్యం. స్త్రీకి సిగ్గు ఎక్కువ. కనుక ప్రేమతోలాలించి, బుజ్జగించాలంటే తనకన్నా చిన్నదావ్వాలి. స్త్రీ సహజంగా పురుషుని కన్నా బలవంతురాలు కాదు. కనుక సంసారాన్ని మోయలేదు. కష్టపడలేదు. పైగా స్త్రీ పెద్దదైతే కుటుంబం యొక్క భారం స్త్రీ మీదే పడుతుంది. మగవాడిదే కుటుంబ భారమని చెప్పటానికే అనాదిగా ఈ ఆచారం. అందువల్లే భార్యకంటే భర్తకి ఎక్కువ వయసు ఉండాలన్నది మన పెద్దలు నియమం పెట్టారు.

13. పూజలో కొబ్బరికాయ క్రుళ్ళితే మంచిదా? కాదా?

పూజలో కొట్టిన కొబ్బరికాయ క్రుళ్ళితే దోషమేమికాదు. అపచారం అంతకన్నా కాదు తెలిసి పని కాదు కనుక దేవాలయాల్లో కొట్టే కొబ్బరికాయ క్రుళ్ళితే వెంటనే ఆ కాయను నీళ్ళతో శుభ్రంచేసి మళ్ళీ మంత్రోచ్చారణ చేసి స్వామిని అలంకరిస్తారు. అంటే ఆ దోషం క్రుళ్ళిన కొబ్బరికాయదేకాని ఇచ్చిన వ్యక్తిది కాదని ఇందులోని పరమార్థం. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ క్రుళ్ళితే క్రుళ్ళిన భాగాన్నితీసేసి కాళ్ళూ, చేతులూ, ముఖమూ కడుగుకొని పూజామందిరాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ పూజ ఆరంభించటం మంచిది. వాహనాలకి కొట్టే కాయ క్రుళ్ళితే దిష్టి అంతా పోయినట్టే. అయినా సరే మళ్ళీ వాహనం కడిగి మళ్ళీ కొబ్బరికాయ కొట్టాలి.

14.విజయవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ అందుకుంటే కలియుగాంతమేనా?

శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చెప్పారు. ధూమశకటాలు నడుస్తాయని, ముఖానికి రంగేసుకున్న వారు దేశనాయకులవుతారనీ, భర్తలేని స్త్రీ రాజ్యమేలుతుందనీ, త్రాగే మంచినీళ్ళు కొనుక్కుంటారనీ…ఆయన చెప్పిన వన్నీ జరిగాయి. విజయవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ అందుకుంటే కలియుగం అంతమయిపోయినట్టే. అంత ఎత్తున కృష్ణమ్మ ఎగిస్తే ఇక భూమి మీద ఏం మిగులుతుంది?

15. కార్తీకమాసంలో ఆహారంతో పాటు తీసుకోకూడనవి ఏవి?

ఉల్లిపాయ, ఇంగువ, ముల్లంగి, ఆనపకాయ, మునగకాయ, వంకాయ, గుమ్మడికాయ, పుచ్చకాయ, వెలగపండు, చద్ది అన్నము. మినుములు, పెసలు, శెనగలు, ఉలవలు; కందులు ఇవన్నీ వాడరాదు. అష్టమి నాదు కొబ్బరీ, ఆదివారము ఉసిరీ తినరాదు.

16. మంగళ, శుక్రవారాలు ఇతరులకు డబ్బు ఎందుకివ్వరు?

సంపాదించేవాడు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాళ్ళు ఖర్చు చేస్తారు. కనీసం ఆ 2 రోజులైనా ఆ సోమరితనాన్ని ఆపాలన్న ప్రయత్నము. అలాగే అమావాస్యనాడు కూడా అప్పు ఇవ్వరు. ధనాన్ని అదుపు చేయటానికి ఇది మంచి పద్ధతే అయినా మనకి గానీ, ఇతరులకు గానీ ఆపదసమయాల్లో ఈ నిమయం పనికి రాదు..