ధనయోగం బలంగా ఉంది. శ్రీలక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఆస్తులు, పెట్టుబడుల ద్వారా ధనవృద్ధి జరుగుతుంది. వృథా ఖర్చులు నివారించాలి. రుణాల విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్య కార్యక్రమాల్లో విశ్వాసంతో ముందుకు సాగాలి. ఉద్యోగంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే సమస్యలు రావు. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. శివారాధన, నవగ్రహ స్మరణ శుభప్రదం.