భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టి పెడతారు. అధికారులతో వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. వ్యయ నియంత్రణ విషయంలో శ్రద్ధ వహించాలి. జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా ఆహార, విశ్రాంతి క్రమబద్ధంగా ఉండాలి. చంద్రధ్యానం మేలు చేస్తుంది.
ప్రారంభించిన పనుల్లో అదృష్టం కలిసి వస్తుంది. స్వల్ప ప్రయత్నంతో మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగంలో స్థిరత్వం, గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా ఆశించిన లాభాలు వస్తాయి. సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు చేసే పనులు పేరు తీసుకువస్తాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. శ్రీమహాలక్ష్మి ధ్యానం శాంతిని ఇస్తుంది.