మీ మీ రంగాల్లో కార్యజయం ఉంది. కీర్తి వృద్ధి చెందుతుంది. బంధువుల ఆదరాభిమానాలు ఉంటాయి. అర్థలాభం ఉంది. శ్రీఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.
ప్రధాన కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. పెద్దల నుంచి సహకారం, మార్గదర్శనం లభిస్తుంది. ఇతరుల ప్రలోభాలకు లొంగకుండా, మీరు ముందే నిర్ణయించిన విధంగానే పనులను పూర్తి చేయండి. మధ్యలో పనులను వాయిదా వేయకుండా సమయపాలనతో ముందుకు సాగాలి. ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. మిమ్మల్ని ఒత్తిడికి గురిచేయాలనుకునే వారు ఉన్నప్పటికీ, సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. మీ వల్ల తోటి వారికి కూడా కొంత మేలు జరుగుతుంది. ప్రోత్సాహకర వాతావరణం ఏర్పడుతుంది. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. ధనాదాయ మార్గాలు మెరుగుపడతాయి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని బాధ్యతాయుతంగా కృషి చేస్తే ఆర్థికంగా శ్రేష్ఠమైన లాభాలు సాధిస్తారు. పెట్టుబడుల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా రెండుసార్లు ఆలోచించండి. ఆవేశాన్ని అదుపులో పెట్టండి. సమయానికి తగ్గట్టు ముందుకు సాగండి. మీ సాధన ఎంత ఉంటే ప్రతిఫలం అంత ఉంటుంది. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్మరణ శక్తిని ఇస్తుంది.