Logo

ప్రారంభించిన పనుల్లో ఆశించిన ఫలితాలను రాబట్టడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. అరుగుదలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీవారి దర్శనం శుభకరం.

ఏకాగ్రతతో పనులు ప్రారంభిస్తే ఇబ్బందులు ఉండవు. మీరు ఎంత ఉత్సాహంగా పనిచేస్తే ఫలితాలు అంత బాగుంటాయి. ఆర్థికంగా అనుకూలమే అయినా, డబ్బును జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగంలో, వ్యాపారంలో ఒత్తిడికి గురికాకుండా ఉండటం ముఖ్యం. శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.