దైవబలం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మనోధైర్యంతో ముందుకు సాగి సత్ఫలితాలు సాధిస్తారు. బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఈశ్వర ఆరాధన శుభప్రదం.
సకాలంలో పనులు ప్రారంభించండి, విజయం వరిస్తుంది. మనోబలంతో ముందుకు సాగండి. గౌరవప్రదమైన ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆలోచనతో ముందుకు సాగండి. అపార్ధాలకు అవకాశం ఇవ్వవద్దు. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు వాయిదా వేయండి. ఇష్టదేవతా ధ్యానం శ్రేయస్కరం.