Logo

ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. బంధుప్రీతి ఉంది. వస్త్ర, ధన లాభాలు ఉన్నాయి. దుర్గాస్తుతి చదివితే బాగుంటుంది.

ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. మీ నిర్ణయాలను కుటుంబ సభ్యులతో పంచుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఆర్థిక అభివృద్ధికి కాలం అనుకూలం. పెట్టుబడుల రూపంలో ధనం వృద్ధి చెందుతుంది. గృహ, భూ, వాహనాది యోగాలు అనుకూలిస్తాయి. వివాదాలకు దూరంగా, శాంతంగా వ్యవహరించాలి. శ్రీమహాలక్ష్మి ధ్యానం శుభప్రదం.