చేపట్టే పనుల్లో శ్రమ ఫలిస్తుంది. వ్యాపార యోగం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ఎప్పటి పనులు అప్పుడే పూర్తిచేసుకోవాలి. ఆర్థిక లాభాలు అనుకూలంగా ఉన్నాయి. సూర్య ధ్యానం శుభప్రదం.
ధనయోగం అనుకూలంగా కొనసాగుతోంది. సంపదలను పెంచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏకాగ్రతతో ముందుకు సాగితే ఆర్థికంగా మంచి పురోగతి సాధిస్తారు. శుక్రయోగ ప్రభావంతో ఐశ్వర్య సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అనవసర ఆలోచనలకు దూరంగా ఉండాలి. మనోధైర్యంతో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఒంటరిగా కాకుండా తోటివారి సహకారంతో పనిచేస్తే మేలు. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో మాటపట్టింపులకు పోకుండా సర్దుకుపోయే ధోరణి మేలు చేస్తుంది. ఈశ్వరారాధన శుభప్రదం.